తెలుగు స్టేట్స్ లో ‘కింగ్డమ్’ 2 రోజుల వసూళ్ల వివరాలు!

Kingdom

సెన్సేషనల్ స్టార్ ది విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కింగ్డమ్”. మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించి సాలిడ్ డే 2 వసూళ్లు కూడా అందుకుంది. ఇలా రెండు రోజులు వసూళ్లు చూసినట్టు అయితే పి ఆర్ నెంబర్స్ ప్రకారం లెక్కలిలా ఉన్నాయి.

కింగ్డమ్ రెండో రోజు వసూళ్లు ఏరియాల వారీగా

నైజాం – 1.85 కోట్లు
సీడెడ్ – 79 లక్షలు
ఉత్తరాంధ్ర – 48 లక్షలు
గుంటూరు – 21 లక్షలు
తూర్పు గోదావరి – 26 లక్షలు
పశ్చిమ గోదావరి – 18 లక్షలు
కృష్ణ – 21 లక్షలు
నెల్లూరు – 13 లక్షలు

మొత్తం డే 2 – 4.11 కోట్లు షేర్ ని కింగ్డమ్ రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో అందుకుంది.

2 రోజుల మొత్తం షేర్లు చూసుకున్నట్టయితే

నైజాం – 6.05 కోట్లు
సీడెడ్ – 2.49 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.64 కోట్లు
గుంటూరు – 0.96 కోట్లు
తూర్పు – 1.00 కోట్లు
కృష్ణ – 0.80 కోట్లు
పశ్చిమ – 0.62 కోట్లు
నెల్లూరు – 0.47 కోట్లు

2 రోజుల మొత్తం షేర్ – 14.03 కోట్లు కింగ్డమ్ అందుకొని స్ట్రాంగ్ వీకెండ్ ని ప్రామిస్ చేస్తుంది. ఆల్రెడీ బుకింగ్స్ కూడా బాగానే కొనసాగుతుండగా ఈ వీకెండ్ కి ఎలాంటి నెంబర్స్ ని సినిమా నమోదు చేస్తుందో చూడాలి.

Exit mobile version