మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇప్పటికే సాలిడ్ హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా నుండి వస్తున్న ప్రమోషనల్ కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘మీసాల పిల్ల’ అయితే ఇన్‌స్టంట్ చార్ట్ బస్టర్‌గా మారింది. ఇప్పటికే 80 మిలియన్లకి పైగా వ్యూస్‌తో ఈ పాట దుమ్ములేపుతోంది.
ఇక రీసెంట్‌గా వచ్చిన శశిరేఖ సాంగ్ కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ పాటకు తక్కువ టైమ్‌లో 20 మిలియన్లకు పైగా వ్యూస్ రావడంతో ఈ పాట కూడా ఇన్‌స్టంట్ హిట్‌గా మారింది. ఈ రెండు పాటలతో ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ తో దుమ్ము లేపుతున్నారు.
ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్ సాంగ్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.
