ఎన్టీఆర్, ప్రభాస్ ల ఫస్ట్ ఛాయిస్ ఆ బాలీవుడ్ బేబీ..!

ఎన్టీఆర్, ప్రభాస్ ల ఫస్ట్ ఛాయిస్ ఆ బాలీవుడ్ బేబీ..!

Published on Apr 27, 2020 11:32 PM IST

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగులో భరత్ అనే నేను చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత బోయపాటి దర్శకత్వంలో చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయరామ సినిమాలో కూడా నటించింది. ఈ మధ్య బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ రావడం తో ఈ అమ్మడు టాలీవుడ్ పై ఫోకస్ తగ్గించింది. గత ఏడాది ఆమె నటించిన కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఐతే టాలీవుడ్ దర్శక నిర్మాతల కన్ను కియారా పై పడింది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా కియారా ను తీసుకోవాలని అనుకుంటున్నారు. అలాగే ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరక్కనున్న చిత్రంలో హీరోయిన్ గా కియారా పేరు పరిశీలిస్తున్నారని సమాచారం. కియారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం ఉండడం తో పాటు బాలీవుడ్ లో కూడా ఫేమ్ సంపాదించింది. దీనితో తమ చిత్రాలకు హీరోయిన్ గా కియారా బెటర్ అని మేకర్స్ ఆలోచనట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు