మన ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద భారీ యాక్షన్ అండ్ పక్కా మాస్ మసాలా సినిమాలు కంటెంట్ తో సంబంధం లేకుండా హిట్టయ్యినవి ఉన్నాయి. అలాంటి స్ట్రాంగ్ కంటెంట్ మరియు మంచి ఎమోషన్స్ కావాల్సినంత మాస్ స్టఫ్ తో వచ్చిన చిత్రం “కేజీయఫ్”. గత 2018లో విడుదల కాబడిన ఈ చిత్రం మాస్ ఆడియెన్స్ కు భీభత్సంగా నచ్చేసింది.
దీనితో రెండో పార్ట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రెండో పార్ట్ లో మాత్రం మొదటి పార్ట్ కంటే భారీ స్థాయిలో యాక్షన్ తో తెరకెక్కిస్తున్నారు. మరి ఇలాంటి సినిమాకు క్లైమాక్స్ ఎంత కీలకమైనదో తెలిసిందే. అందుకే ఈ ఎపిక్ క్లైమాక్స్ షూట్ ను సంజయ్ మరియు యష్ ల మధ్య భీకర పోరాట సన్నివేశాన్ని హైదరాబాద్ లో తెరకెక్కించనున్నారని తెలుస్తుంది.
ఇటీవలే యాష్ హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. అలాగే సంజయ్ కూడా పూర్తిగా రెడీ అయ్యిపోయారు ఈ భారీ క్లైమాక్స్ ను నవంబర్ మొదటి వారం నుంచి తెరకెక్కించనున్నట్టు సమాచారం. అలాగే ఈ భారీ ప్రాజెక్ట్ ను మేకర్స్ సంక్రాంతి రేస్ లో ఉంచాలని చూస్తున్నారు.