అల్లరి నరేష్, షర్మిల మాండ్రే జంటగా నటిస్తున్న ‘కెవ్వు కేక’ సినిమా ఆడియో విడుదల వాయిదాపడింది. ముందుగా ఈ వేడుకను జూన్ 2న నిర్వహించాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ వేడుకను ఈ నెలలోనే వేరే తేదికి మార్చారు. ఈ సినిమాకు దేవి ప్రసాద్ దర్శకుడు. బొప్పన చంద్రశేఖర్ నిర్మాత. ఇదివరకు అల్లరి నరేష్, దేవి ప్రసాద్ కలయికలో వచ్చిన ‘బ్లేడ్ బాబ్జీ’ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమా కుడా ఆలాగే వుంటుందని తెలిపారు. ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ “నిర్మానంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో త్వరలో విడుదలకానుంది. ఈ సినిమాను జూన్ లోనే విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని” తెలిపారు. భీమ్స్ మరియు చిన్ని చరణ్ సంగీతాన్ని అందించారు