కేరింత సినిమాలో నటిస్తామని కేరింతలు కొడుతున్న జనం

Saikiran-Adivi
వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు సినిమాలు తీసిన సాయికిరణ్ అడివి ఇప్పుడు యూత్ ఫుల్ ఎంటెర్టైనర్ ను తీయనున్నాడు. ఈ సినిమాకు కేరింత అనే టైటిల్ ను అనుకున్నారు. దిల్ రాజు నిర్మాత. ఈ సినిమాకోసం కొత్త టాలెంట్ కోసం స్టార్ హంట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు

సమాచారం ప్రకారం దీనికి అనూహ్య స్పందన వచ్చింది. ఇప్పటికే మా టీ.వి తరపున 50000 అప్ప్లికేషన్లు వచ్చాయి. మరో రెండు రోజుల్లో మరిన్ని వస్తాయని అంచనా. వీటిని జాగ్రత్తగా పరిశీలించి సరైన వారిని ఎంచుకుని కాస్త సమయం తీసుకున్నాకే సెట్ మీధకు వెళ్లనున్నారు

పెద్ద సినిమాల నిర్మాతగా పేరు సంపాదించుకున్న దిల్ రాజు ఈ సినిమాను నిర్మించడం విశేషం. మిక్కీ జె మేయర్ సంగీత దర్శకుడు

Exit mobile version