సూర్య సినిమాలో కీర్తి సురేష్..?

టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి ‘లక్కీ భాస్కర్’ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు ఈ డైరెక్టర్. ఈసారి తమిళ హీరో సూర్యతో ఓ సినిమాను చేసేందుకు వెంకీ అట్లూరి రెడీ అవుతున్నాడు. అయితే, ఈ సినిమా ఓ బయోపిక్ మూవీగా రానున్నట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాకు ‘796 CC’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియాకు మారుతి కార్లను తీసుకొచ్చిన ప్రయత్నాన్ని ఈ సినిమాలో మనకు దర్శుకుడు వెంకీ అట్లూరి చూపించబోతున్నాడట. మారుతి కార్ ఇంజిన్ సామర్ధ్యం సూచించేది కావడంతో ‘796 CC’ అనేది పర్ఫెక్ట్ టైటిల్ అని మేకర్స్ ఫీల్ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో సూర్య సరసన హీరోయిన్‌గా అందాల భామ కీర్తి సురేష్‌ను తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సూర్యతో కీర్తి సురేష్ కాంబినేషన్ కొత్తగా కనిపిస్తుందని మేకర్స్ భావిస్తున్నారట. మరి నిజంగానే ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుందా అనేది వేచి చూడాలి. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది.

Exit mobile version