నాని సినిమాలో యంగ్ సెన్సేషన్..?

న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘హిట్ 3’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమా సక్సెస్ తర్వాత నాని తన నెక్స్ట్ చిత్రాలపై ఫోకస్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని ఇప్పటికే ప్రారంభించాడు నాని. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌లో కూడా ఆయన జాయిన్ అవుతాడు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ కయాదు లోహర్ సెలెక్ట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్రాగన్’ మూవీలో నటించిన ఈ బ్యూటీ తన నటనతో ఆడియన్స్‌కు దగ్గరయ్యింది.

దీంతో ఆమెను ‘ది ప్యారడైజ్’ మూవీ కోసం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ సినిమాలో మరో స్టార్ బ్యూటీ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయంపై మేకర్స్ అఫీషియల్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Exit mobile version