5 కిలోల బరువు తగ్గిన కత్రినా.!

5 కిలోల బరువు తగ్గిన కత్రినా.!

Published on Nov 16, 2012 10:56 AM IST


బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్ గ్లామరస్ బ్యూటీ అంటే ఎవరూ కాదనరుగా, ప్రస్తుతం కత్రినా ధూమ్ కి సీరీస్ గా వస్తున్న ‘ధూమ్ 3’ సినిమా కోసం 5 కిలోల బరువు తగ్గాల్సి వచ్చింది. కత్రినా చాలా సింపుల్ గా కేవలం రెండు నెలల్లోనే 5 కిలోల బరువు తగ్గించేసింది. ఇది పెద్ద విషయం ఏమీ కాకపోవచ్చు కానీ ఇప్పటికే స్లిమ్ గా ఉండే ఆ భామ ఇంకా స్లిమ్ అయ్యి కుర్ర కారుకి మతిపోగొట్టనుంది. ఈ విషయం గురించి కత్రినా చెబుతూ ‘ ‘ధూమ్ 3′ మీద ప్రేక్షకులకు భారీ అంచనాలున్నాయి. ఇందులో నేను చేసే కొన్ని యాక్షన్ సీన్స్ కోసం ఫిట్ గా కనపడాలి అందుకే రోజుకి ఒకటిన్నరగంట వ్యాయామం చేస్తున్నాను. డైట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. మసాలా ఉన్న ఫుడ్ ఏమీ తినడం లేదు, అలాగే చాక్లెట్స్ మరియు ఐస్ క్రీమ్స్ కూడా ఏమీ తినడం లేదు. నేను బాగా కనపడటం కోసం రోజూ ఫిష్ మరియు ఫ్రూట్ సలాడ్స్ తీసుకుంటున్నానని’ తెలిపింది.

అభిషేక్ బచ్చన్ మరియు ఉదయ్ చోప్రా కీలక పాత్రలు పోషిస్తున్న ‘ధూమ్ 3’ లో మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలిచే అమీర్ ఖాన్ నెగటివ్ రోల్ లో కనిపించనున్నారు. విజయ్ కృష్ణా ఆచార్య డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బరువు తగ్గిన కత్రినా ఎంత గ్లామరస్ గా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు