కార్తి నటించిన ‘బిర్యాని’ సినిమా సెప్టెంబర్ 6న తమిళ మరియు తెలుగు భాషలలో విడుదలకు సిద్ధంగావుంది. ఈ సినిమాలో కార్తి సరసన హన్సిక నటిస్తుంది. ప్రేమ్ జీ, మాండీ థాకర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కె.ఈ జ్ఞానవేల్ రాజ నిర్మిస్తున్నాడు. యువన్ శంకర్ రాజ సంగీత దర్శకుడు. ఈ సినిమాలో చాల భాగాన్ని హైదరాబాద్ మరియు చెన్నైలలో తీసారు. ‘శకుని’, ‘బాడ్ బాయ్’ సినిమాలు పరాజయంకావడంతో ఈ సినిమా కార్తికు ముఖ్యమైన చిత్రంగా నిలవనుంది. ఒక రాత్రి బిర్యానీ కోసం బయటకు వెళ్ళిన వ్యక్తి జీవితంలో చోటుచేసుకున్న సన్నివేశాలను యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ విధానంలో తెరకెక్కించారు. వెంకట్ ప్రభు ఇప్పటికే ‘చెన్నై – 28’, ‘సరోజ’ ‘గోవా’ మరియు ‘మంకత్త’ వంటి సినిమాలను తీసాడు. ‘మంకత్త’ సినిమా తెలుగులో ‘గ్యంబ్లర్’గా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కార్తి మరి తెలుగులో తన పరాజయాల బాటనుండి బయటపడతాడేమో చూడాలి.
సెప్టెంబర్ 6న విడుదలకానున్న బిర్యాని
సెప్టెంబర్ 6న విడుదలకానున్న బిర్యాని
Published on Jul 22, 2013 8:45 PM IST
సంబంధిత సమాచారం
- రజినీ, కమల్ మల్టీస్టారర్ పై కొత్త ట్విస్ట్!
- తెలంగాణ విమోచన దినోత్సవం నాడు ‘ఏడు తరాల యుద్ధం’ అనౌన్సమెంట్
- ‘మిరాయ్’ వసూళ్ల వర్షం.. 100 కోట్ల క్లబ్ తో పాటు మరో ఫీట్
- ‘లిటిల్ హార్ట్స్’ నిర్మాత నెక్స్ట్.. అపుడే సాలిడ్ ఓటిటి డీల్ పూర్తి?
- మోక్షజ్ఞతో ‘మిరాయ్’ చూసిన బాలయ్య!
- ఇళయరాజా ఎఫెక్ట్.. ఓటిటి నుంచి అజిత్ సినిమా తొలగింపు!
- సోషల్ మీడియాని షేక్ చేసిన ‘ఓజి’ కొత్త స్టిల్స్!
- “కాంతార” ట్రైలర్ ఇంకెప్పుడు? ఇందుకే ఆలస్యం?
- నాని నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ బజ్.. ఈసారి అలాంటిదా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- 4 రోజుల్లో వరల్డ్ వైడ్ “మిరాయ్” వసూళ్లు ఎంతంటే!
- ఫోటో మూమెంట్ : సంప్రదాయ వేషధారణలో ఒకే ఫ్రేమ్‌లో మెరిసిన క్రికెట్ రాణులు
- ఇంటర్వ్యూ : ప్రియాంక మోహన్ – ‘ఓజీ’ నాకు చాలా స్పెషల్..!
- పిక్ టాక్ : యూఎస్ కాన్సులేట్‌లో ఎన్టీఆర్.. డ్రాగన్ కోసమే..!
- పోల్ : ‘ఓజి’ నుంచి ఇపుడు వరకు వచ్చిన నాలుగు సాంగ్స్ లో మీకేది బాగా నచ్చింది?
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!