శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న కార్తికేయ

karthikeya
‘హ్యాపీడేస్’ చిత్రవిజయంతో తన కెరీర్ ను ఆరంభించిన నిఖిల్ సిద్ధార్ధ తన గత చిత్రం ‘స్వామి రారా’ విజయంతో చాలా ఆనందంగా వున్నాడు.

ప్రస్తుతం నిఖిల్ ‘కార్తికేయ’ సినిమాతో బిజీగా వున్నాడు. తమిళనాడు పరిసర ప్రాంతాలలో మరియు కుంబకోణంలో ఇటీవలే ఈ సినిమా ముఖ్యమైన షెడ్యూల్ ను ముగించుకుంది. తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో త్వరలో మొదలుకానుంది. ఈ షెడ్యూల్ 15రోజులపాటు సాగనుంది. ఈ చిత్రాన్ని ఏకకాలంలో తమిళంలో కుడా తెరకెక్కిస్తున్నారు. నితిన్ కి ఇది మొదటి ద్విభాషా చిత్రం. నితిన్ తో ‘స్వామి రారా’ లో జంటగా నటించిన స్వాతి ఇందులో కుడా కధానాయిక

చందూ మొందేటి దర్శకుడిగా పరిచయంకానున్నాడు. శేఖర్ చంద్ర దర్శకుడు. మాగ్నమ్ సినిమా ప్రైమ్ బ్యానర్ పై వెంకట్ శ్రీనివాస్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. డిసెంబర్ లో విడుదలకు ఈ చిత్రం సిద్దమవుతుంది

Exit mobile version