మెగాస్టార్ తో వచ్చిన కిక్ తన పది సినిమాలు రిలీజైనా రాదంటున్న యువ హీరో!

మెగాస్టార్ తో వచ్చిన కిక్ తన పది సినిమాలు రిలీజైనా రాదంటున్న యువ హీరో!

Published on Jul 16, 2020 11:13 AM IST

ఒక అభిమానిగా తన అభిమాని హీరోను నిజంగా కాస్త దూరంగా అయినా చూడాలి అనుకుంటారు చాలా మంది. మరికొందరు అయితే ఒక్క ఫోటో దిగినా చాలు అనుకుంటారు. అలాంటి ఫ్యాన్ మూమెంట్స్ కోసం ఒక్క సామాన్య జనమే కాకుండా మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న యువ హీరోలు కూడా తమ అభిమాన స్టార్ హీరో విషయంలో భావిస్తారు.

అలాంటి ఫ్యాన్ మూమెంట్ కంటే ఎక్కువే తనకు దొరికింది అని మన టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ అంటున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఎందరికో ప్రేరణగా నిలిచిన సంగతి తెలిసిందే. అలా హీరో కార్తికేయకు కూడా చిరునే పెద్ద రోల్ మోడల్. ఇదే విషయాన్ని ఓ అవార్డు ఫంక్షన్ లో మెగాస్టార్ చూసి చెప్పి మరీ కంటతడి పెట్టుకున్నాడు.

కానీ ఈసారి ఏకంగా ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించే అవకాశం రావడంతో ఈ వచ్చిన కిక్ ముందర తనవి పది సినిమాలు విడుదలైనా సరే సరిపోదు అని అంటున్నాడు. కరోనా బారి నుంచి తప్పించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో భాగంగా మాస్క్ ధరించమని చెప్తూ చేసిన అవగాహనా వీడియోతో కార్తికేయ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్ మూమెంట్ ను చెప్పలేని విధంగా పంచుకున్నాడు.

తాజా వార్తలు