తమిళ హీరో కార్తీ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఆయన నటిస్తున్న నెక్స్ట్ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు. దర్శకుడు తమీజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ‘మార్షల్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. అంతేగాక ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అయితే, ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌లో హీరో ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు.
దీంతో ఈ సినిమాలో కార్తీ లుక్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.