అనుష్కను తెగ పొగిడేస్తున్న బ్యాడ్ బాయ్

bad-boy
ఇండస్ట్రీలో యోగా బ్యూటీ అనుష్క మోస్ట్ ప్రొఫెషనల్ హీరోయిన్ అని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. ఆమెతో పనిచేసిన కో స్టార్స్, డైరెక్టర్స్ ఆమె సెట్స్ లో ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా తన పని తానూ చేసుకుంటుంది, అలాగే ఆమె ఆఫ్ స్క్రీన్ ఉండే విధానాన్ని బుక్ గా కూడా రాయొచ్చు అంటారు. ఇటీవలే ‘బృందావనంలో నందకుమారుడు’ సినిమా షూటింగ్లో ఆమె ప్రొఫెషనలిజం చూసి సెల్వరాఘవ విపరీతంగా పోగిడేసాడు. ఈ వరుసలో ఇప్పుడు హీరో కార్తీ వంతు వచ్చింది.

కార్తీ – అనుష్క కలిసి సూరజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్యాడ్ బాయ్’ సినిమాలో నటించారు. ఈ సినిమాలో కొన్ని రిస్కీ షాట్స్ ఉంటాయట ఆ సీన్స్ గురించి చెప్పినప్పుడు అనుష్క ఒక్కసారి కూడా ఆలోచించకుండా కార్తీతో కలిసి చేసేసేదట. కార్తీ మాట్లాడుతూ ‘ ఈ సినిమాలో చేజ్ సీన్స్, రివర్స్ డ్రైవింగ్ సీన్స్, కొండల్లో నుంచి జారి పడడం, పైన్నుంచి నీళ్ళలోకి దూకడం లాంటి సన్నివేశాలను అనుష్క ఏమాత్రం ఆలోచించకుండా చేసేసేది. ఆమె సినిమాకి అంతలా కమిట్ మెంట్ ఇవ్వడం అనేది అభినందనీయదగినదని’ అన్నాడు.

బ్యాడ్ బాయ్ తమిళ్లో అలెక్స్ పాండ్యన్ పేరుతో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా కోసం తమిళ తంబీలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తమిళంలో సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమాని తెలుగులో జనవరి 25న రిలీజ్ చేస్తున్నారు. జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

Exit mobile version