సమీక్ష : కర్మణ్యే వాధికారస్తే – రొటీన్ గా సాగే ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ !

Karmanye Vadhikaraste Reiew

విడుదల తేదీ : అక్టోబర్ 31, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహేంద్ర, బెనర్జీ, పృథ్వి, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధా, కృష్ణ భట్ తదితరులు
దర్శకుడు : అమర్ దీప్ చల్లపల్లి
నిర్మాత : డి ఎస్ ఎస్ దుర్గాప్రసాద్
సంగీత దర్శకుడు : గ్యాని
సినిమాటోగ్రాఫర్ : భాస్కర్‌ సామల
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘కర్మణ్యే వాధికారస్తే’. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

యాడ్‌ ఫిల్మ్‌మేకర్‌ జై(మాస్టర్ మహేంద్ర) అమ్మాయిలను ట్రాప్‌ చేసి, శారీరకంగా వాడుకొని హత్యలు చేస్తుంటాడు. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసు కోసం స్పెషల్‌ టీమ్‌ బరిలోకి దిగి విచారణ ప్రారంభిస్తుంది. మరోవైపు సినీస్టార్‌ పృథ్వీ(పృథ్వీ) యాక్సిడెంట్ కేసును ఏసీపీ అర్జున్‌ (శత్రు) విచారిస్తుంటాడు. అలాంటి కేసులు చుట్టుపక్కల పోలీస్‌ స్టేషన్లలో కూడా నమోదు అవుతాయి. వాటి వెనుక ఎవరు ఉన్నారనే దిశగా అర్జున్‌ విచారిస్తుంటాడు. ఇంకోవైపు సస్పెండ్‌ అయిన హెడ్‌ కానిస్టేబుల్‌ కీరిటీ(బ్రహ్మాజీ) కి చెక్‌పోస్ట్‌ దగ్గర డ్యూటీ చేస్తున్న సమయంలో తీవ్రంగా గాయపడ్డ ఓ బాలిక కనిపిస్తుంది. ఆమెను కొంతమంది గ్యాంగ్‌ రేప్‌ చేశారని డాక్టర్‌ చెబుతారు. దీని వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకునేందుకు.. అ బాలికను తన ఇంట్లోని ఉంచుకొని చికిత్స అందిస్తుంటాడు. వేర్వేరుగా జరిగిన ఈ మూడు కేసుల వెనుక ఉన్నది ఎవరు? ఎందుకు చేశారు? ఆపరేషన్‌ జిస్మత్‌ మ్యాటరేంటి? జిష్ణు ఎవరు? హానీట్రాప్‌కి పాల్పడిందెరు? చివరకు ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగింది ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

యాక్సిడెంట్ కేసు చుట్టూ అల్లుకున్న ఇన్సిడెంట్స్ అలాగే యాడ్‌ ఫిల్మ్‌మేకర్‌ అమ్మాయిలను ట్రాప్‌ చేసి, శారీరకంగా వాడుకొని హత్యలు చేసే సీన్స్ వంటి అంశాలు సినిమాలో బాగున్నాయి. ఇక హీరోగా మాస్టర్ మహేంద్ర చక్కని నటనను కనబరిచాడు. కొన్ని కీలక సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకు మాస్టర్ మహేంద్ర పూర్తి న్యాయం చేశాడు. అలాగే, ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన బ్రహ్మాజీ చాలా బాగా నటించాడు. మరో కీలక పాత్రలో నటించిన శత్రు కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు.

అలాగే బెనర్జీ, పృథ్వి, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధా, కృష్ణ భట్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. అన్నట్టు
క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమాను దర్శకుడు అమర్ దీప్ చల్లపల్లి మలిచిన విధానం బాగుంది. సినిమాలో క్రైమ్ పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం కూడా బాగుంది. ముఖ్యంగా సినిమాలో వచ్చే ఇంటర్వెల్ సీక్వెన్స్ మరియు క్లైమాక్స్ ఆకట్టుకున్నాయి. అలాగే, కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా ఉన్నా.. కొన్ని చోట్ల ప్లే మాత్రం చాలా సింపుల్ గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ బోర్ గా సాగాయి. ఫస్ట్ హాఫ్ ను ఇంకా బలంగా రాసుకుని ఉండాల్సింది. దీనికితోడు, సినిమాలో అనవసరమైన ల్యాగ్ సీన్స్ కూడా ఎక్కువైపోయాయి. పైగా ఈ సినిమా స్లో నేరేషన్ తో పాటు బోరింగ్ ట్రీట్మెంట్ అండ్ ఫేక్ ఎమోషన్స్ తో సాగుతుంది. అలాగే కొన్ని సీన్స్ సరిగ్గా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వవు. అయితే దర్శకుడు అమర్ దీప్ దర్శకత్వ పనితనం సినిమా పై ఆసక్తిని కలిగించింది.

అదే విధంగా దర్శకుడు రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని సన్నివేశాలు మరియు క్లైమాక్స్ సీన్స్ బాగున్నప్పటికీ.. కథ కథనాలను కూడా ఇంకా బెటర్ గా రాసుకుని ఉండి ఉంటే బాగుండేది. ముఖ్యంగా కిల్లర్ నెక్ట్స్ ఎవరిని చంపుతాడా ? అనే ఉత్కంఠను ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. మొత్తానికి సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తర్వాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశారు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు అమర్ దీప్ చల్లపల్లి మంచి క్రైమ్ థ్రిల్లర్స్ కి గుడ్ ట్రీట్మెంట్ ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. ప్లే ఇంకొంచెం బెటర్ గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. మూవీ ఓపెనింగ్ దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా నేచురల్ గా చూపించారు. గ్యాని సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకా బెటర్ ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాత డి ఎస్ ఎస్ దుర్గాప్రసాద్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

తీర్పు :

‘కర్మణ్యే వాధికారస్తే’ అంటూ వచ్చిన ఈ సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్‌.. కొన్ని చోట్ల ఆకట్టుకుంది. ఐతే, కొన్ని క్రైమ్ సీన్స్ అండ్ మెయిన్ సీక్వెన్స్ లు బాగున్నప్పటికీ.. స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ సీన్స్ లేకపోవడం, కొన్ని కీలక సన్నివేశాల్లో లాజిక్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. మొత్తమ్మీద ఈ క్రైమ్ డ్రామాలో కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. సినిమా మాత్రం పూర్తి స్థాయిలో అలరించలేకపోయింది.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team 

Exit mobile version