మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా వెంకీ మామ ఓ ఇంట్రెస్టింగ్ కామియో రోల్ లో దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు కోసం అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇక లేటెస్ట్ గా మెగాస్టార్ అల్లు వారి ఇంట జరుగుతున్న శుభకార్యానికి హాజరైన సంగతి అందరికీ తెలిసిందే. ఇక్కడ స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు మెగాస్టార్ ని కలవడం జరిగింది. ఈ మీట్ లో మెగాస్టార్ చిరంజీవిని కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని రాయుడు తెలిపాడు. దీనితో వీరి కలయిక పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో చిరు డైరెక్ట్ సినిమా సెట్స్ నుంచే వచ్చినట్లు కనిపిస్తుంది. ఇలా తన లుక్ కూడా వైరల్ గా మారింది.
