కన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ నటించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సాలిడ్ వసూళ్లతో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు. ఇక ఈ సినిమాతో రిషబ్ శెట్టి పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కాంతార చాప్టర్ 1’ తెరకెక్కిస్తున్నారు.
ఇక ఈ సినిమాను కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్‌పై రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు బయ్యర్లు రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని తెలుగు రాష్రాల్లో ప్రాంతాల వారీగా ఎవరెవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే..
నైజాం – మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్
ఉత్తరాంధ్ర – విఘ్నేశ్వర (వారాహి చలనచిత్రం)
ఈస్ట్, వెస్ట్ గోదావరి – గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్
గుంటూరు – వారాహి చలనచిత్రం
కృష్ణా – కెఎస్ఎన్ టెలీఫిల్మ్
నెల్లూరు – ఎస్‌వి సినీ
సీడెడ్ – శిల్పకళ ఎంటర్‌టైన్‌మెంట్స్ (వారాహి చలనచిత్రం)
ఇలా టాప్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను హొంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.