ఏపీలో పెరిగిన ‘కాంతార చాప్టర్ 1’ టికెట్ రేట్లు.. ఎంతంటే..?

ఏపీలో పెరిగిన ‘కాంతార చాప్టర్ 1’ టికెట్ రేట్లు.. ఎంతంటే..?

Published on Oct 1, 2025 1:03 AM IST

kantara chapter 1

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 2న ఈ సినిమా వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటేందుకు రిషబ్ శెట్టి రెడీ అవుతున్నాడు.

అయితే, ఈ సినిమాకు ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75/-, మల్టీప్లెక్స్‌లో రూ.100/- అదనపు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ టికెట్ ధరలు అక్టోబర్ 1న స్పెషల్ ప్రీమియర్స్ మొదలుకొని అక్టోబర్ 11 వరకు అమలవుతాయని ప్రభుత్వం తెలిపింది.

ఇక ఈ టికెట్ రేట్ల పెంపుతో కాంతార చాప్టర్ 1 మేకర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించాడు.

తాజా వార్తలు