‘కుబేర’కి ‘కన్నప్ప’ ఎఫెక్ట్ తప్పేలా లేదా!

‘కుబేర’కి ‘కన్నప్ప’ ఎఫెక్ట్ తప్పేలా లేదా!

Published on Jun 26, 2025 7:05 AM IST

చాలా రోజులు తర్వాత మళ్ళీ తెలుగు సినిమా దగ్గర సినిమాలుతో థియేటర్స్ సందడిగా మారాయి. ఇలా లేటెస్ట్ గా ధనుష్, శేఖర్ కమ్ముల కలయికలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం “కుబేర” 100 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకోగా ఇక ఈ సినిమా తర్వాత రిలీజ్ కి సిద్ధంగా ఉన్న మరో అవైటెడ్ పాన్ ఇండియా సినిమానే “కన్నప్ప”. మంచు విష్ణు హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రమే ఇది.

మరి ఈ సినిమా ఎఫెక్ట్ అయితే ఈ వారం కుబేరపై పడేలా ఉందని చెప్పాలి. చాలా మంది కన్నప్పని తక్కువ అంచనా వేసి ఉండొచ్చు కానీ తెలుగు రాష్ట్రాల్లో కన్నప్ప మంచి బుకింగ్స్ ని ఇపుడు నమోదు చేస్తుంది. సింగిల్ స్క్రీన్స్ నుంచి మల్టీప్లెక్స్ ల వరకు కన్నప్ప డే 1 కి సాలిడ్ బుకింగ్స్ ని రిజిస్టర్ చేస్తుంది. సో రెండో వారంలో కూడా బాగానే పెర్ఫామ్ చేస్తున్న కుబేరకి ఇది ఎఫెక్ట్ అనే చెప్పొచ్చు. మరి మంచి టాక్ వచ్చి కన్నప్ప కూడా నిలబడితే రెండు సినిమాలూ బాగా రన్ అవుతాయి. మరి చూడాలి ఏమవుతుంది అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు