మెగా హీరోకి విలన్ గా కన్నడ స్టార్ హీరో..?

మెగా హీరోకి విలన్ గా కన్నడ స్టార్ హీరో..?

Published on Mar 14, 2020 9:22 AM IST

వరుణ్ తేజ్ మరో వైవిధ్యమైన కథను తన సినిమాకు ఎంచుకున్నాడు. తన పదవ చిత్రంగా తెరకెక్కుతున్న మూవీలో ఆయన ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇటీవలే ఈ చిత్ర వైజాగ్ షెడ్యూల్ పూర్తి కాగా త్వరలో నెక్స్ట్ షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు. ఇక ఈ చిత్రం కొరకు వరుణ్ నిపుణుల దగ్గర బాక్సింగ్ లో శిక్షణ తీసుకున్నాడు. ఈ చిత్రంలో కన్నడ హీరో ఉపేంద్ర ఓ కీలక రోల్ చేస్తున్నారట. ఆయన విలన్ గా లేదా వరుణ్ కి కోచ్ గా కనిపించే అవకాశం కలదని వినిపిస్తుంది.

ఇక గతంలో ఉపేంద్ర అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో విలన్ రోల్ చేశారు. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తుండగా, అల్లు వెంకట్, సిద్దు ముద్ద నిర్మిస్తున్నారు . ఈ చిత్రానికి బాక్సర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

తాజా వార్తలు