తన పెళ్లి పై క్రేజీ హీరోయిన్ క్లారిటీ !

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ‘కంగనా రనౌత్’ వివాదాస్పద విషయాలతో ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు పంచుకుంటుంది. అయితే, ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ప్రచారం జరిగింది. నిజానికి గత కొంతకాలంగా కంగనా పెళ్లి పై పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. కంగనా తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ఆమె తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘నా పెళ్లి పై ఇప్పటికే ఎన్నో వార్తలు రాశారు. వాటిల్లో ఒక్కటి కూడా నిజం లేదు’ అంటూ కంగనా తెలిపింది.

కంగనా ఇంకా మాట్లాడుతూ.. ‘నిజానికి నాకు పెళ్లి మీద పెద్దగా నమ్మకం లేదు. అందుకే, దానికి దూరంగా ఉంటున్నాను. నాకు పెళ్లి కావట్లేదనే బాధ అస్సలు లేదు. ప్రస్తుతం నేను సినిమాలు, పాలిటిక్స్ మీదనే దృష్టి పెడుతున్నాను. పెళ్లి గురించి ఎక్కువ ఆలోచించలేదు. బహుషా పెళ్లి, పిల్లలు అనేవి నాకు సూట్ కావు’ అంటూ కంగనా రనౌత్ క్రేజీ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం కంగనా సినిమాలతో పాటు అటు రాజకీయాల్లోనూ బిజీగా ఉంది.

Exit mobile version