కన్నడ + ఉర్దూ పదాలతో కొలవేరి స్థాయిలో మరో పాట

కన్నడ + ఉర్దూ పదాలతో కొలవేరి స్థాయిలో మరో పాట

Published on Feb 5, 2012 11:32 AM IST

కన్నడ సినిమా ‘గోవిందాయ నమః’ లోని ప్యార్గే ఆగ్బిట్టైతే పాట 3.73 లక్షల హిట్స్ తో బాగా పాపులర్ అయింది. ఇటీవల ధనుష్ పాడిన ‘కొలవేరి డి’ పాట తమిళ్ మరియు ఇంగ్లీష్ పదాలతో సాగిపోతూ శ్రోతలను ఆకట్టుకుంది అదే విధంగా ఈ పాటలో కన్నడ మరియు ఉర్దూ పదాలతో ఉంది. కన్నడ వారిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాట పాడిన చేతన్ మరియు ఇందు కన్నడ యాసతో పాడుతూ ఆకట్టుకున్నారు. ఈ పాటకి సాహిత్యం పవన్ వాడేయార్ అందించారు. ఆయనకు ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఈ పాటకి గురు కిరణ్ సంగీతం అందించగా ఈ సినిమాలో కోమల్ మరియు పరుల్ యాదవ్ ముఖ్య పాత్రలు పోషించారు. రెండు నెలల్లో సౌత్ నుండి బాగా పాపులర్ అయిన రెండో పాట ఇదే కావడం విశేషం.

తాజా వార్తలు