యూనివర్శల్ హీరో కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం’ సినిమా అనుకున్న దాని ప్రకారం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ తాజా సమాచారం ప్రకారం జనవరి 25న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డి.టి.హెచ్ లో ప్రీమియర్ షో వేస్తాను అన్నందువల్ల కొన్ని ఇబ్బందుల్లో ఇరుక్కుంది. థియేటర్ ఓనర్లతో ఈ విషయం గురించి ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అందరికీ తెలిసిన తమిళ విమర్శకుడు కన్నన్ ఈ విషయాన్ని ట్వి ట్ట ర్ లో పోస్ట్ చేసాడు. త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.