‘థగ్ లైఫ్’ ఓటిటి, శాటిలైట్ హక్కుల డీటెయిల్స్ ఇవే!

పాన్ ఇండియా లెవెల్లో లేటెస్ట్ గా రిలీజ్ కి వచ్చిన చిత్రం “థగ్ లైఫ్”. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ అలాగే దర్శకుడు మణిరత్నం కలయికలో ఎన్నో ఏళ్ళు తర్వాత ఈ సినిమా ఎట్టకేలకి థియేటర్స్ లోకి వచ్చింది. అయితే మరీ అంత గొప్ప టాక్ ని ఈ సినిమా సొంతం చేసుకోకపోవడం అనేది కొంచెం తమ కాంబినేషన్ అభిమానులకి బాధాకరమే అని చెప్పాలి.

ఇక ఇవి పక్కన పెడితే థగ్ లైఫ్ తాలూకా నాన్ థియేట్రికల్ హక్కులకు సంబంధించిన డీటెయిల్స్ తెలుస్తున్నాయి. అయితే పాన్ ఇండియా ఓటిటి డీల్ ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక శాటిలైట్ హక్కులు విషయానికి వస్తే.. స్టార్ మా సంస్థ వారు ఈ సినిమాని సొంతం చేసుకున్నారు. సో థియేటర్స్ లో రిలీజ్ తర్వాత థగ్ లైఫ్ వీటిలో సందడి చేయనుంది.

Exit mobile version