మార్చ్ 3నుండి కమల్ ఉత్తమ విలన్

మార్చ్ 3నుండి కమల్ ఉత్తమ విలన్

Published on Feb 27, 2014 2:32 PM IST

Kamal_Haasan

ఉత్తమ విలన్ గా కమల్ మనకు కినిపించడానికి ముచ్చటపడుతున్నాడు. బెంగుళూరులో మార్చ్ 3నుండి ఈ సినిమా మొదలుకానుంది. కమల్ చిరకాల స్నేహితుడు, కన్నడ నటుడైన రమేష్ అరవింద్ ఈ సినిమాతో దర్శకుడిగా మారనున్నాడు. లింగుస్వామి ఈ సినిమాకు నిర్మాత

తన ఆహార్యం మీద కసరత్తు చేస్తూ గంటలుతరబడి మేక్ అప్ రూం లో గడుపుతున్న కమల్ ని చూస్తే తనకి ఈ సినిమా ఎంత ప్రాణమో చెప్పొచ్చు. ఒకదానితో ఒకటి సంబంధంలేకుండా ఈ సినిమాలో పలు పాత్రలు వేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి గానూ కాజల్ అగర్వాల్, తమన్నా మరియు త్రిషలను ఎంపిక చేసుకున్నట్లుకూడా ఒక వార్త తిరుగుతుంది. కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. వచ్చేవారంలో ప్రకటన ఇచ్చే అవకాశాలు వున్నాయి

తమిళ, తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కనున్న ఈ సినిమా ట్విస్ట్ తో కూడిన రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనుంది. ఘిబ్రన్ సంగీతదర్శకుడు. కమల్ విశ్వరూపం 2 ఈ ఏడాదిలో మనముందుకు రానుంది

తాజా వార్తలు