కొనసాగుతున్న కమల్ హాసన్ మరియు థియేటర్ యజమానుల మధ్య గొడవ

“విశ్వరూపం” చిత్ర విడుదల చుట్టూ నెలకొన్న సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి కొద్ది రోజుల క్రితం ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కమల్ హాసన్ టాటా స్కై, ఎయిర్ టెల్ వంటి సంస్థలతో ఈ చిత్రాన్ని నేరుగా టివిలలో విడుదల చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయం నచ్చని థియేటర్ యాజమాన్యం ఈ చిత్రాన్ని నిషేదించాలని అనుకున్నారు ఈ ఘటనతో కమల్ హాసన్ వెనక్కి తగ్గుతారని అనుకున్నారు కాని కమల్ హసన్ నిర్మాతలందరినీ పిలిపించి తన ఆలోచనను చెప్పాడు వాళ్ళు కూడా ఈ ఆలోచనను ఆమోదించడంతో థియేటర్ యాజమాన్యం భవిష్యత్తులో ఎం చెయ్యాలన్న అంశం మీద అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు కమల్ హాసన్ మాత్రం డిస్ట్రిబ్యుటర్స్ మరియు ఎగ్జిబిటర్స్ కి ఎటువంటి నష్టం ఉండదు అని చెప్తున్నారు. ఈ చిత్రానికి ఎటువంటి మినిమం గ్యారంటీ అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. రెవెన్యు మొత్తం షేరింగ్ ఆధారంగానే ఉంటుంది అని కమల్ హాసన్ అంటున్నారు. తీవ్ర వాదం మీద తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ హాసన్, పూజ కుమార్, ఆండ్రియా మరియు రాహుల్ బోస్ ప్రధాన పాత్రలు పోషించారు. శంకర్ -ఎహాసన్-లాయ్ సంగీతం అందించిన ఈ చిత్రం అన్ని సరిగ్గా జరిగితే జనవరి 11న విడుదల కానుంది.

Exit mobile version