ఒకే తాటిపై వెంకీ, కమల్

ఒకే తాటిపై వెంకీ, కమల్

Published on Jan 31, 2014 3:14 AM IST

kamalhasn_venkatesh
నాలుగు సంవత్సరాల క్రితం కమల్ హాసన్, వెంకటేష్ లు కలిసి చక్రి తోలేటి తీసిన ఈనాడులో నటించారు. వారి వారి కెరీర్ లో మొదటిసారిగా కలిసి నటించిన సినిమా. నాలుగేళ్ల తరువాత మరోసారి వీరు ఒకే సినిమా పై వార్తలలో నిలిచారు

మలయాళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం సినిమాను వెంకటేష్ తెలుగులో రీమేక్ చెయ్యబోతున్నట్లు తెలిసిన విషయమే. మోహన్ లాల్, మీనా ఒరిజినల్ వర్షన్ లో హీరో హీరోయిన్స్. తెలుగులో ఈ సినిమాను శ్రీప్రియ తెరకెక్కిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ దృశ్యం తమిళ రీమేక్ లో కమల్ హాసన్ నటిస్తున్నట్లు తెలిపారు. ఒరిజినల్ వర్షన్ ను తీసిన జీతూ జోసెఫ్ ప్రస్తుతంతమిళ వర్షన్ ను తీయనున్నాడు. మరిన్ని వివరాలు త్వరలో తెలపనున్నారు

ప్రస్తుతం వెంకటేష్ సి.సి.ఎల్ 4 సీజన్ లో బిజీగా వున్నాడు. తెలుగు వారియర్స్ సారిధిగా కొనసాగుతున్న వెంకీ అది పూర్తవగానే దృశ్యం రీమేక్ మరియు మారుతి తీస్తున్న రాధ సినిమాలో హోం మినిస్టర్ గా నటించనున్నాడు

తాజా వార్తలు