తెలుగు ఇండస్ట్రీ పెద్దలను పొగడ్తలతో ముంచెత్తిన కమల్

Kamal-Haasan
కమల్ హాసన్ దర్శకనిర్మాతగా తీసిన ‘విశ్వరూపం’ సినిమా విడుదల సమయంలో తనకి సపోర్ట్ గా నిలిచిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వారికి ధన్యవాదాలు చెప్పడం కమల్ ఇంకా ఆపనే లేదు. ఈ రోజు సాయంకాలం జరిగిన సక్సెస్ మీట్లో దాసరి నారాయణరావు,కె. విశ్వనాథ్, రామానాయుడు,కె. రాఘవేంద్రరావు, రమేష్ ప్రసాద్,ఎస్.ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్,నాగార్జున, ప్రభాస్ పాల్గొన్నారు.

విశ్వరూపం గురించి నాగార్జున మాట్లాడుతూ ‘ ఇప్పటివరకూ కమర్షియల్ గా సినిమాకి డామేజ్ జరిగినా నిన్న తమిళనాడులో భారీ ఎత్తున సినిమా విడుదలైంది. అలాగే ఎన్నో హాలీవుడ్ సినిమాలకన్నా ఇది బాగుందన్నారు’. కమల్ తో ‘సాగర సంగమం’ తీసిన కె.విశ్వనాథ్ మాట్లాడుతూ ‘ కమల్ హాసన్ కి నాలెడ్జ్ చాలా ఎక్కువ, ఇండస్ట్రీలో ఇంకా సక్సెస్ అందుకోవాలంటే కొన్ని మర్చిపోవాలి. అతని వల్లే నేను నటున్నయ్యానని’ అన్నారు.

త్రివిక్రమ్ ఎంతో ఎమోషనల్ గా మాట్లాడుతూ ‘ ఇప్పుడు హిమాలయాలలో ఉన్న వారికి నిమోనియా వస్తే అక్కడ ఉన్న వారిని వేరే ప్రాంతానికి మారుస్తామే కానీ హిమాలయాలను మార్చం కదా, కమల్ గారు కూడా హిమాలయాలు లాంటి వారు, ఆయన కూడా ఎప్పటికీ ఇండియా లోనే ఉంటారని’ అన్నాడు. దాసరి నారాయణరావు సెన్సార్ బోర్డ్ చేతగాని తనంపై ద్వజమెత్తారు.వారు చేసిన తప్పు వల్ల గవర్నమెంట్ కమల్ కి న్యాయం చేసిందని అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ ‘ కమల్ గా తమిళనాడు విడిచి వెళ్ళి పోతానన్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయన్నారు’.

కమల్ హాసన్ తనకి సాయం చేసిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అందరికీ ధన్యావాదాలు చెప్పారు ముఖ్యంగా నాగార్జున ఒక నేషనల్ టీవీ ఛానల్ లో స్టేట్మెంట్ ఇచ్చి సపోర్ట్ చేసారు. ‘ నేను నా ఆస్తి, ఇల్లు అన్నీ నష్టపోయాను, కానీ అది నాకు పెద్ద విషయం కాదు ఇప్పుడు నా మంచి కోరుకునే శ్రేయోభిలాషులు చాలా మంది ఉన్నారు అందులోనూ ఆంధ్రప్రదేశ్లో, అలాగే ఎంతో అండగా నిలిచిన మీడియా వారికి కూడా కృతఙ్ఞతలు. సారధి స్టూడియోస్ లో నా కెరీర్ ప్రారంభించాను ఆ తర్వాత నేను చేసిన ‘మరో చరిత్ర’, ‘ఏక్ దుజే కె లియే’ సినిమాలు నా కెరీర్లో మైలురాల్లుగా నిలిచిపోయాయి. విశ్వరూపం సినిమా విషయంలో ఎవరి పైనా నాకు కోపం లేదు కానీ నేను మాత్రం మానసికంగా చాలా కృంగిపోయాను. నను ఒక నటున్ని, డైరెక్టర్, కానీ ద్రోహిని కాదు. ఏ ఒక్క నటుడికి అవమానం జరగకూడదని భావిస్తానని’ కమల్ అన్నారు.

Exit mobile version