ట్విట్టర్లో హల్ చల్ చేస్తున్న కమల్ హాసన్ డూప్

ట్విట్టర్లో హల్ చల్ చేస్తున్న కమల్ హాసన్ డూప్

Published on Jun 2, 2013 9:20 AM IST

Kamal
సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో కొత్తగా సందడి చేస్తున్న హీరో కమల్ హాసన్. కమల్ ట్విట్టర్లో జాయిన్ అయ్యి, అలాగే తనని ట్విట్టర్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడానికి కారణమైన తన ఫ్రెండ్ శేఖర్ కపూర్ కి థాంక్స్ చెప్పారు. ” శేఖర్ కపూర్ నేను ట్విట్టర్లో చేరడానికి స్పూర్తినిచ్చాడు. ఇక్కన నేను నా ఐడియాలను, అలాగే మీతో పాటు కొన్ని విషయాలపై చర్చిద్దాం అనుకుంటున్నానని’ కమల్ ట్వీట్ చేసాడు. కమల్ ట్విట్టర్ అకౌంట్ ‘@maiamkhassan‘ అని ఉంటుంది.

ప్రస్తుతం కమల్ హాసన్ ‘విశ్వరూపం 2’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే బ్యాంకాక్లోని ఎయిర్ బేస్ లో ఈ చిత్ర మెయిన్ టీం పై ఒక యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేసారు. పూజా కుమార్, ఆండ్రియా జెరేమియా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో శేఖర్ కపూర్, రాహుల్ బోస్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత లింగుస్వామి నిర్మాతగా కమల్ హాసన్ నటిస్తూ దర్శకత్వం వహించనున్నాడు.

అప్డేట్ 11:45 : ఈ రోజు ఉదయం ఇండస్ట్రీలోని కొంతమంది సెలబ్రిటీలు, కమల్ హాసన్ కూడా తను ట్విట్టర్లో జాయిన్ అయ్యాను అని తెలియగానే థ్రిల్ అయ్యారు. ఎస్ఎస్ రాజమౌళి, హారీష్ శంకర్, నాని లాంటి ప్రముఖులు ఆయనకీ స్వగతం కూడా పలికారు. కమల హాసన్ కి ప్రసనల్ ఇంచార్జ్ అయిన నిఖిల్ మురుగన్ ఆ అకౌంట్ ఫేక్ అని తెలిపాడు. ‘ కమల్ సార్ ట్విట్టర్లో లేరు, @maiamkhassan ఇది ఫేక్ అకౌంట్ దాన్ని నమ్మకండి, అది చేసిన వారిపై త్వరలోనే లీగల్ గా యాక్షన్ తీసుకుంటామని’ తెలిపాడు. అది తెలియగానే అందరూ అతని అకౌంట్ కి ట్వీట్స్ వేయడంతో అతను అకౌంట్ డెలీట్ చేసాడు.

తాజా వార్తలు