గాన గంధర్వుడిగా భావించే త్యాగరాజ స్వామిపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ‘రాముడిని స్థుతిస్తూ బిచ్చమెత్తి బతికేవాడు.. అంటూ త్యాగరాజ స్వామిని ఉద్దేశిస్తూ కమల్ హాసన్ కమల్ అనగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. త్యాగరాజ స్వామిని దేవుడిలా కొలిచే ఎంతో మంది కర్ణాటక సంగీతకారులు కమల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తమిళ ప్రముఖ హీరో విజయ్ సేతుపతితో కలిసి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కోసం ఇన్స్టాగ్రామ్ లైవ్లో పాల్గొన్న కమల్ ఇలా మాట్లాడం జరిగింది.
మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి. ప్రస్తుతం కమల్ హాసన్ శంకర్ డైరెక్షన్ లో భారతీయుడు 2 మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కాగా, లాక్ డౌన్ అనంతరం విడుదల కానుంది. ఈ మూవీలో కమల్ కి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.