యూనివర్శల్ హీరో కమల్ హాసన్ భారతదేశ చలన చిత్ర రంగానికి అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్నారని సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ అన్నారు. ఇటీవలే సింగపూర్ లో జరిగిన ఐఫా అవార్డ్స్ వేడుకలో ప్రముఖ హాలీవుడ్ ప్రొడ్యూసర్ బారీ ఎం. ఒస్బోర్న్ కమల్ తో ఒక చిత్రం చేయాలనుకుంటున్న విషయం గురించి కమల్ తో చర్చలు జరిపారు. ప్రముఖ నటుడు ప్రభు కొడుకు విక్రమ్ ప్రభు హీరోగా నటిస్తున్న ‘గుమ్కి’ చిత్ర ఆడియో వేడుకలో పాల్గొన్న రజనీ ఈ విషయం గురించి మాట్లాడుతూ ” కమల్ కి హాలీవుడ్ నుంచి పిలుపు రావడం చాలా గొప్ప విషయం. కమల్ మన దేశానికి మరియు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ని గర్వపడేలా చేసారని” ఆయన అన్నారు.
ఈ కార్యక్రమానికి రజనీ కాంత్, కమల్ హాసన్, సూర్య మరియు కార్తీ అతిధులుగా హాజరయ్యారు. ప్రస్తుత యంగ్ హీరోల గురించి రజనీ కాంత్ మాట్లాడుతూ ” ప్రస్తుతం యంగ్ హీరోలు సంవత్సరానికి ఒక సినిమా మాత్రమే చేస్తున్నారు అది సరైన పద్ధతి కాదు. కచ్చితంగా సంవత్సరానికి రెండు లేదా మూడు సినిమాలు చెయ్యాలి, ఎందుకంటే ఒక సినిమా నిరుత్సాహపరిచినా మిగిలిన సినిమాలు సంతోశాన్నిచ్చే ఫలితాన్ని ఇస్తాయి.
ఈ మధ్యే హాలీవుడ్ నిర్మాత క్వెంటిన్ టరంటినో తన ‘కిల్ బిల్’ సినిమా కోసం 2001లో కమల్ హాసన్ నటించిన ‘అభయ్’ మూవీలోని కొన్ని సన్నివేశాలను స్పూర్తిగా తీసుకున్నారని స్వయంగా ఆయనే తెలియ జేశారు. కమల్ గారు మీ యొక్క నటనా చాతుర్యాన్ని హాలీవుడ్లో కూడా చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం.