కళ్యాణ్ రామ్ తన నూతన సినిమా ‘ఓం’ ని ప్రేక్షకుల మధ్యకు తీసుకురావడానికి దొరికిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడంలేదు. ఈ యాక్షన్ సినిమాను 3డి లో తీసారు కనుక పోస్ట్ ప్రొడక్షన్ పనులకే దాదాపు 9నెలలు పట్టింది. ఈ పనులను సింగపూర్, లాస్ అంజెల్స్ లో పూర్తిచేసారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో మే ఆఖరి వారంలో విడుదలకానుంది. విశేషం ఏమిటంటే ఈ వేడుక వేదిక మీదకు కళ్యాణ్ రామ్ నందమూరి వంశంలో వాళ్ళందరిని తీసుకురానున్నాడట. అన్నీ అనుకున్నట్టు జరిగితే చంద్రబాబు నాయుడు కుడా హాజరవుతారంట. ఈ ‘ఓం’ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కృతి కర్బంధ, నికిషా పటేల్ హీరోయిన్స్. సునీల్ రెడ్డి దర్శకుడు.