కాజల్ అగర్వాల్ ఈ నెల్ 28వ తేది కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇంతకీ ఆరోజులో అంత స్పెషల్ ఏంటా అని అనుకుంటున్నారా?? ఆరోజే తన చెల్లి నిషా అగర్వాల్ కు ముంబైకు చెందిన వ్యాపారవేత్త కరణ్ వలేచ తో వివాహం జరగనుంది.
“నా ప్రియమైన చెల్లలు తనకు తగిన వరుడిని ఎంపిక చేసుకునే అంత పెద్దది అయిపొయింది. ఈ నెల 28న ముంబైలో వివాహం చేసుకోనుంది. నాకు, నా కుటుంబ జీవితంలో ఇదో మరిచిపోలేని రోజు. ఈ శుభసందర్భంలో మా మీద వెలకట్టలేని ప్రేమను చూపించినందుకు మీకు నా ధన్యవాధాలు” అని కాజల్ ఎఫ్.బి పేజి ద్వారా తెలిపింది
ఈ పెళ్లి ప్రైవేటు ఫంక్షన్ గా జరగనుంది. కాజల్ ఇప్పటివరకూ ఏ కొత్త తెలుగు సినిమాను అంగీకరించలేదు. ఆమె నటించిన ‘జిల్లా’ సినిమా 2014 జనవరిలో విడుదలకానుంది