ఈ మధ్య చాలా పుకార్లకు కాజల్ కేంద్రబిందువుగా నిలుస్తుంది. ఇదివరకు ఒక ఫాషన్ షో కు హాజరుకాకుండా నిర్వాహకులకు ఆఖరి నిముషంలో హ్యాండ్ ఇచ్చి తన బాధ్యతను మరిచిపోయింది అంటూ వార్తలొచ్చాయి.
కనీ కాజల్ ఈ వార్తలన్నీ కేవలం పుకార్లు అని తేల్చి చెప్పింది. జె.జె వాల్య యొక్క కలెక్షన్ తో నిర్వహించే ఫ్యాషన్ షో కు తనను నిర్వాహకులు సంప్రదించారని, అయితే డేట్లు ఖాళీ లేక కుదరదు అని చెప్పి ఇరువైపులనుండి సరైన సమాచారంతోనే ముందుకు సాగామని తెలిపింది. కానీ అనుకోకుండా ఈ పుకారు ఎందుకు బయటకు వచ్చిందో తనకు తెలియదని వాపోయింది తమ మధ్య మీడియా పుట్టిస్తున్న మన్స్పర్ధలు ఏమి లేవన్న విషయాన్ని స్వయంగా జి.జి వాల్య సైతం అంగీకరించాడు. ఇరువైపులనుండి ఒకే నిర్ణయం రావడంతో కాజల్ ఆనందంగానే వుంది