సంధ్య నాకు దగ్గరగా ఉండే పాత్ర – కాజల్

సంధ్య నాకు దగ్గరగా ఉండే పాత్ర – కాజల్

Published on Dec 2, 2012 5:56 PM IST

కాజల్ అగర్వాల్ ఈ మధ్య కాలంలో బాగా బిజీగా ఉంటుంది ఈ మధ్యనే రవితేజ నటిస్తున్న “సారోచ్చారు” చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు ఈ చిత్రం ప్రమోషన్స్ ఇప్పటికే మొదలయ్యింది కాజల్ ఉన్న మొదటి వీడియోని నిన్న విడుదల చేశారు. కాజల్ ఈ చిత్రంలో తన పాత్ర గురించి మాట్లాడుతూ ” నా పాత్ర పేరు సంధ్య టామ్ బాయ్ వ్యక్తిత్వం ఉన్న పాత్ర ఇది, నాకు చాలా దగ్గరగా ఉండే పాత్ర. రవితేజ,పరశురాం మరియు ప్రియాంక దత్ లతో కలిసి పని చెయ్యడం చాల ఆనందంగా ఉంది” అని చెప్పారు. ఈ చిత్రంలో రవితేజ,రిచా గంగోపాధ్యాయ్ మరియు కాజల్ ప్రధాన పాత్రలు పోషించారు. నారా రోహిత్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో డిసెంబర్ 5న చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు