త్వరలో పుస్తకం రాసే ఆలోచనలో కాజల్ అగర్వాల్

kajal-aggarwalకాజల్ అగర్వాల్ త్వరలో ఒక పుస్తకం రాయనుంది. గత కొంతకాలంగా పలు హీరోలు, దర్శకులు బయోగ్రఫిలను విడుదల చెయ్యడం అందులో పలు అంశాలు విమర్శలకు దారి తీయడం జరిగాయి. అలా కాకుండా కాజల్ తను ప్రయాణించిన ప్రదేశాల గురించి ఒక పుస్తకం రచించనుంది. ఐదేళ్ళుగా చిత్రాలలో నటిస్తున్న ఈ నటి షూటింగ్ లేదా హాలిడే ల మీద పలు ప్రదేశాలను తిరిగారు అక్కడ తన జ్ఞాపకలన్నింటికి ఒక పుస్తక రూపం ఇవ్వాలని ఈ నటి అనుకుంటుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ “బాద్షా” చిత్రంలో మరియు “ఆల్ ఇన్ ఆల్ అలగురాజ” అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో ఈ భామ “నాయక్” చిత్రంలో కనిపించనున్నారు ఈ చిత్రం జనవరి 9న విడుదల కానుంది.

Exit mobile version