కాజల్ అగర్వాల్ సినిమాల కౌంట్ ఈమధ్య తగ్గిందనే చెప్పాలి. గతంలో తెలుగులో వచ్చే పెద్ద, యంగ్ హీరోల సినిమాల్లో తరచూ కనిపించే కాజల్ ఇప్పుడు పెద్దగా కనిపించట్లేదు. ప్రజెంట్ ఆమె చేతిలో కొన్ని సినిమాలే ఉన్నాయి. అయితే ఇక్కడ విశేషమేమిటంటే ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ తక్కువే అయినా అన్నీ పెద్దవే కావడం. కాజల్ ప్రజెంట్ హిందీ, తమిళం, తెలుగుల్లో ఒక్కో సినిమా చేస్తున్నారు.
హిందీలో జాన్ అబ్రహం సరసన ‘ముంబై సాగా’ చేస్తున్న ఆమె తమిళంలో శంకర్, కమల్ హాసన్ చేస్తున్న భారీ చిత్రం ‘ఇండియన్ 2’లో కథానాయికగా నటిస్తోంది. ఇక తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివల ‘ఆచార్య’లో అవకాశం దక్కించుకుంది. మొదట ఇందులో త్రిష హీరోయిన్ అనుకున్నా కొన్ని కారణాల వలన ఆమె తప్పుకోవడంతో కాజల్ ఆ ఛాన్స్ కొట్టేసింది. పైగా చిరుతో ఆమెకు ఇది రెండో సినిమా కావడం విశేషం. మొత్తానికి కాజల్ స్పీడ్ తగ్గినా ఆమె చరీష్మా మాత్రం తగ్గలేదు.