కెరీర్ ని ముద్దుతో పోల్చిన బర్త్ డే భామ

కెరీర్ ని ముద్దుతో పోల్చిన బర్త్ డే భామ

Published on Jun 19, 2013 12:18 PM IST

Kajal-Agarwal‘లక్షీ కళ్యాణం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ‘చందమామ’ సినిమాతో లైం లైట్ లోకి వచ్చిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ భాషల్లో కూడా టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న కాజల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అన్ని భాషల్లోనూ నటిస్తున్నారు కానీ బాలీవుడ్ లో నటించాక మీలో మీకు ఏమన్నా మార్పు కనిపించిందా అని అడిగితే ‘ మొదటి ముద్దు మనలోని ఆకలిని తీరిస్తే, రెండో ముద్దుతో మనం రుచిని చూస్తాం. సినీ ప్రయాణం కూడా ఇంచు మించు అలాంటిదే కెరీర్ ప్రారంభంలో అవకాశం దొరికితే చాలనుకున్న నాకు, ఇప్పుడు మంచి కథ దొరికితే బాగుంటుందనిపిస్తోంది. అలాగే ప్రతి భాషలోనూలోనూ ఒక్కో విధంగా నటించాలని లేదు. నాకు నేను కొన్ని లిమిటేషన్స్ పెట్టుకున్నాను వాటికి అనుగుణంగానే ఉంటాను. ఏ భాషలో అయినా ఒకేలా ఉంటాను, ఒకేలా నటిస్తాను. నన్ను ఈ స్థాయికి చేర్చిన ప్రేక్షకులకి కొత్తగా ఎమన్నా చేయాలనిపిస్తుంటుందని’ ఆమె అంది.

ప్రస్తుతం తమిళ్లో రెండు, హిందీలో రెండు సినిమాలు చేస్తున్న కాజల్ తెలుగు సినిమాల విషానికి వచ్చే సరికి ‘ఎవడు’ సినిమాలో చేస్తున్న అతిధి పాత్ర తప్ప వేరే సినిమాలు చేతిలో లేవు. కాజల్ పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు