మణిరత్నం లేటెస్ట్ మూవీ కడలి ఆడియో విడుదల కార్యక్రమం జనవరి 10న హైదరాబాదులో జరగనుంది. ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు రెహమాన్ సంగీతం అందించిన ఈ పాటలు ఇప్పటికే మార్కెట్లో దొరుకుతుండటం విశేషం. మణిరత్నం సినిమాకి సంభందించిన కొందరు సభ్యులు ఈ వేడుకలో పాల్గొని ఆడియో విడుదల చేయనున్నారు. గౌతమ్ కార్తీక్, తులసి నాయర్ ఇద్దరినీ పరిచయం చేస్తూ రాబోతున్న ఈ సినిమాలో లక్ష్మి మంచు, అరవింద్ స్వామి ప్రత్యేక పాత్రల్లో నటించారు. రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ అందించిన కడలి ఫిబ్రవరి 1న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.