జ్యోతిక మళ్లీ నటించే అవకశం ఉంది : సూర్య

జ్యోతిక మళ్లీ నటించే అవకశం ఉంది : సూర్య

Published on May 25, 2012 12:02 PM IST


పెళ్లి అవక ముందు జ్యోతిక సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ హీరొయిన్ . తమిళ్ స్టార్ నటుడు సూర్యని పెళ్లి చేసుకున్న తరువాత ఆమె సినిమాలు చేయడం పూర్తిగా మానేసి ఇంటి భాధ్యతలు చూసుకుంటున్నారు. ఇప్పుడు వారికి దియా మరియు దేవ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సూర్య, జ్యోతిక పెళ్లి అవక ముందు 7 సినిమాల్లో కలిసి నటించారు. వారిద్దరు కలిసి నటించిన సినిమాల్లో ‘కాక్క కాక్క’ మరియు ‘సిల్లును ఒరు కాదల్’ సినిమాలు బాగా హిట్ అయ్యాయి. పెళ్లి అయ్యాక సినిమాల్లో నటించనప్పటికీ వేరిద్దరూ కలిసి అడపా దడపా యాడ్స్ లో కనిపిస్తున్నారు. ఇటీవల సూర్య ఒక వేడుకలో మాట్లాడుతూ నేను తనని నటించ వద్దు అని ఏమీ అనలేదు. ప్రస్తుతం పిల్లల ఆలనా పాలనా చూసుకుంటుంది. భవిష్యత్తులో మళ్లీ సినిమాల్లో నటించే అవకాశం ఉంది అంటూ అన్నారు. జ్యోతిక లాంటి నటి మళ్లీ నటించబోతుంది అంటే మనకు కూడా ఆనందకరమైన వార్తే కదా.

తాజా వార్తలు