‘జూనియర్’ దూకుడు.. డే 1 కంటే డే 2 సాలిడ్ వసూళ్లు.. డే 3 కూడా ర్యాంపేజ్

Junior Movie Review

రీసెంట్ సెన్సేషన్ కిరీటి రెడ్డి హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు రాధాకృష్ణ రెడ్డి తెరకెక్కించిన చిత్రం “జూనియర్”. సాలిడ్ ప్రమోషన్స్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా కిరీటికి కన్నడ సహా తెలుగులో ఒక సాలిడ్ డెబ్యూ అని చెప్పాలి. పెద్దగా కంటెంట్ లేకపోయినా తన టాలెంట్ తోనే దుమ్ము లేపి ఆడియెన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తున్నాడు.

ఒక సర్ప్రైజింగ్ ప్యాకేజీలా మారిన ఈ సినిమా ఇప్పుడు మూడు రోజుల్లో ఊహించని పెర్ఫామెన్స్ చేస్తుంది. అయితే రెండు రోజులు కలిపి తెలుగు స్టేట్స్ లో 5 కోట్ల గ్రాస్ కి పైగా వసూలు చేస్తే ఇది మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూళ్లు సాధించింది అని తెలుస్తుంది. ఇక డే 3 బుకింగ్స్ అయితే మరింత ర్యాంపేజ్ చూపిస్తున్నాయి.

డే 2 కంటే బెటర్ గా డే 3 బుకింగ్స్ ఇపుడు బుక్ మై షోలో నమోదు అవుతుండడం విశేషం. ఈ ట్రెండ్ మాత్రం యంగ్ హీరోకి బిగ్ ప్లస్ అని చెప్పాల్సిందే. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా వారాహి చలన చిత్రం అలాగే సాయి కొర్రపాటి నిర్మాణం వహించారు.

Exit mobile version