జూలై 24.. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ రోజు..!

HHVM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు జూలై 24 తేదీ ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. ఈ తేదీన పవన్ కళ్యాణ్ ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే, జూలై 24 అనేది పవన్ కళ్యాణ్‌కు కేవలం ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజు మాత్రమే కాదు.. ఆయన కెరీర్‌లో తొలి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం రిలీజ్ అయిన రోజు కూడా.

పవన్ కెరీర్‌లో తొలి బిగ్ బ్లాక్ బస్టర్ చిత్రంగా క్లాసిక్ రొమాంటిక్ చిత్రం ‘తొలిప్రేమ’ నిలిచింది. దర్శకుడు కరుణాకరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన అందాల భామ కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమా ఎలాంటి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా రిలీజ్ అయింది కూడా జూలై 24 నే. 1998లో వచ్చిన ఈ సినిమాతో పవన్ కెరీర్‌కు సాలిడ్ బ్రేక్ త్రూ లభించింది. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ సాలిడ్ రెస్పాన్స్ అందుకుంటున్నాయి.

ఇలా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో జూలై 24 తేదీన రెండు సినిమాలు రిలీజ్ కాగా, అందులో ఒకటి ఆయన కెరీర్‌కే బూస్ట్ ఇవ్వగా.. తాజాగా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకునేందుకు సిద్ధమవుతుంది.

Exit mobile version