భారీ ఎత్తున విడుదలకు సిద్దమైన ‘జులాయి’

భారీ ఎత్తున విడుదలకు సిద్దమైన ‘జులాయి’

Published on Jul 29, 2012 7:25 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘జులాయి’ చిత్రాన్ని ఆగష్టు 9న విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ కెరీర్లో భారీగా విడుదల చేయనున్నారు. సుమారు 1600 ల థియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రం కోసం మొదటిసారిగా దేవీ శ్రీ ప్రసాద్ మరియు అల్లు అర్జున్ ల మీద సరికొత్త రీతిలో ఒక ప్రమోషనల్ సాంగ్ ని కూడా తీశారు. గోవా బ్యూటీ ఇలియానా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. డి.వి.వి దానయ్య సమర్పణలో హరికా మరియు హాసినీ క్రియేషన్స్ పైన ఎస్. రాదాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

తాజా వార్తలు