మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ చిత్రమే వార్ 2. గట్టి హైప్ సెట్ చేసుకున్న ఈ సినిమా బుకింగ్స్ చాలా సస్పెన్స్ తర్వాత ఓపెన్ అయ్యాయి.
అయితే అంతకు ముందు వరకు డీసెంట్ గానే బుకింగ్ అయితే తెలుగు స్టేట్స్ లో ఎప్పుడైతే తెరుచుకున్నాయో అక్కడ నుంచి ఎన్టీఆర్ తన స్టార్ పవర్ చూపించాడు.
తెలుగు స్టేట్స్ లో ఓపెన్ అయ్యాక హావర్లీ ట్రెండింగ్ లెక్కలు మారిపోయాయి. ఇలా ఎన్టీఆర్ ఫ్యాక్టర్ బాగా ప్రభావం చూపింది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి ప్రీతమ్ సంగీతం అందించగా యశ్ రాజ్ ఫిల్స్మ్ వారు నిర్మాణం వహించారు.