‘వార్ 2’ నుంచి ఎన్టీఆర్ మాస్ స్టిల్ వైరల్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ లు హీరోలుగా దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “వార్ 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ తో మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ఈ ట్రైలర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రెజెన్స్ కి మంచి కామెంట్స్ కూడా వచ్చాయి.

అయితే ఈ ట్రైలర్ లో ఎన్టీఆర్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇందులో నుంచి ఓ స్టిల్ ఇపుడు ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తుంది. ఒక చేతిలో సుత్తి, మరో చేతిలో దృఢమైన గొలుసు పట్టుకొని తారక్ యుద్ధానికి సిద్ధం అనే రేంజ్ లో కనిపిస్తున్నాడు. దీనితో ఈ క్రేజీ స్టిల్ చూసిన ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందిస్తుండగా యష్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఆగస్ట్ 14న గ్రాండ్ గా విడుదలకి రాబోతుంది.

Exit mobile version