మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇపుడు నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో తాను నటిస్తున్న క్రేజీ యాక్షన్ మల్టీస్టారర్ చిత్రం “వార్ 2” కూడా ఒకటి. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్న ఈ సినిమాపై హైప్ ఇపుడు నెక్స్ట్ లెవెల్లో ఉంది. మరి ఈ చిత్రం కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఈ కొద్ది లోనే బిగ్ అప్డేట్ రానుంది అని బజ్ బయటకి వచ్చింది. ఇక ఇంతలోనే లేటెస్ట్ గా హృతిక్ రోషన్ చేసిన పోస్ట్ ఇపుడు కేజ్రీగా మారింది.
తారక్ పై హృతిక్ చేసిన సర్ప్రైజింగ్ పోస్ట్ ఇలా ఉంది. “హే తారక్, ఈ మే 20న అసలు ఏమొస్తుందో తెలుసా? నేను ఖచ్చితంగా చెప్పగలను అసలేం స్టోర్ చేసి ఉంచామో నువ్ అది ఊహించలేవు. సిద్ధమా?” అంటూ ఈ మే 20న వార్ 2 టీజర్ కి డేట్ ని లాక్ చేసినట్టుగా హృతిక్ చెప్పకనే చెప్పేసాడు. ఇక దీనితో ఎన్టీఆర్ అభిమానులు ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా యష్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
Hey @tarak9999, think you know what to expect on the 20th of May this year? Trust me you have NO idea what’s in store. Ready?#War2
— Hrithik Roshan (@iHrithik) May 16, 2025