ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?

ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?

Published on Aug 27, 2025 9:01 AM IST

Pushpa-and-devara

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన రీసెంట్ సోలో సినిమానే దేవర. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా భారీ వసూళ్లు అందుకొని అదరగొట్టింది. ఇక థియేట్రికల్ గానే కాకుండా ఓటీటీ లోకి వచ్చాక కూడా ఈ చిత్రం సత్తా చాటింది. ఈ సినిమా దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రాగా ఇందులో దేవర పాన్ ఇండియా ఇండస్ట్రీ హిట్ పుష్ప 2 ని మించి భారీ రెస్పాన్స్ అందుకున్నట్టు తెలుస్తోంది.

పుష్ప 2 నెట్ ఫ్లిక్స్ లో 10 వారాల పాటుగా టాప్ 10 లో ట్రెండ్ అయితే దేవర దీనిని బీట్ చేసి 11 వారాల పాటుగా ట్రెండ్ అయినట్టు తెలుస్తోంది. దీనితో ఓటీటీ లో మాత్రం దేవర పుష్ప 2 ని మించి పెర్ఫామ్ చేసింది అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇక దీనికి పార్ట్ 2 కూడా త్వరలోనే మేకర్స్ స్టార్ట్ చేయనున్నారు.

తాజా వార్తలు