స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్స్ లో ఒకరు. తను డాన్స్ ను చాలా అద్భుతంగా చేయగలడు. చాలా కష్టమైన స్టెప్స్ ని కూడా చాలా సునాయాసంగా చేయగలడు. అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా ‘రేస్ గుర్రం’. ఈ సినిమాకోసం తను చాలా ఇంట్రెస్టింగ్ అయిన, కొత్త స్టెప్స్ తో డాన్స్ చేయనున్నాడు. ఈ సినిమాకి జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు. “ఏక్ ధో తీన్ చార్ పాంచ్ పటక నీకు నాకు’ పాట షూటింగ్ ఈ మద్య అన్నపూర్ణ 7 ఎకర్స్ కాంప్లెక్స్ లో జరిగింది. ఈ పాట షూటింగ్ లో శృతి హసన్ కూడా పాల్గొన్నారు.
పెప్పిగా సాగే ఈ పాటలో అర్జున్, శృతి హసన్ స్పెషల్ స్టెప్స్ చేసారని సమాచారం. ఈ పాట సినిమాలో హైలైట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. థమన్ సంగీతాన్నిఅందిస్తున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నాడు.