మిర్చి అనువాద హక్కులను సొంతం చేసుకున్న జాన్ అబ్రహం

మిర్చి అనువాద హక్కులను సొంతం చేసుకున్న జాన్ అబ్రహం

Published on Jul 24, 2013 11:46 PM IST

John
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘మిర్చి’ సినిమా అనువాద హక్కులను బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం సొంతం చేసుకున్నాడు. ప్రభాస్ కెరీర్ లోనే భారీ హిట్ అయిన సినిమా కనుక జాన్ అబ్రహం ఈ సినిమాను సొంతం చేసుకున్నాడు

ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వం వహించాడు. యు.వి క్రియేషన్స్ బ్యానర్ సినిమాను నిర్మించింది. అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్స్

ఈ ‘మిర్చి’ సినిమాను హిందీలో ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది ఇంకా ప్రశ్నగానే మిగిలింది. ఈ సినిమాపై ఎటువంటి విషయాలు ఖరారు కాలేదు. ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు