జీవ చిత్రానికి “మాస్క్” అనే పేరు ఖరారు

జీవ చిత్రానికి “మాస్క్” అనే పేరు ఖరారు

Published on Aug 3, 2012 9:16 PM IST


తమిళ నటుడు జీవ రాబోతున్న సూపర్ హీరో చిత్రానికి “మాస్క్” అనే పేరుని ఖరారు చేశారు. మిస్కిన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో జీవ మాస్క్ లో ఉన్న సూపర్ హీరో గా కనిపించనున్నారు ఈ చిత్రం తమిళంలో “ముగమూడి” అనే పేరుతో తెరకెక్కుతుంది. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తుండగా ఆమెకిదే తెలుగు మరియు తమిళంలో మొదటి చిత్రం. ఆర్ బి చౌదరి ఈ చిత్ర తెలుగు అనువాద హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ నెలలోనే ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు. ఆగస్ట్ 12న హైదరాబాద్ లో ఈ చిత్ర ఆడియో ని విడుదల చెయ్యనున్నారు.ఆంధ్ర ప్రదేశ్ లో “రంగం” చిత్రం విజయం సాదించిన తరువాత తెలుగులో జీవ ప్రముఖ హీరో అయ్యాడు. తరువాత విడుదలయిన “వచ్చాడు గెలిచాడు”, “రౌద్రం” మరియు ” స్నేహితుడు” వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం చవి చూసాయి. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

తాజా వార్తలు